డేట్ చూసి కరోనా రాదు: బిడెన్ వార్నింగ్

యునైటెడ్ స్టేట్స్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుదల నేపధ్యంలో ఆ దేశ ప్రజలకు కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆయన తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. “నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను, కాని వచ్చే ఏడాది వరకు అధ్యక్షుడిగా ఉండను. కరోనా వైరస్ క్యాలెండర్‌ లో తేదీలను గౌరవించదు. ఇది ప్రస్తుతం వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిపాలన ద్వారా ఈ రోజులలో అత్యవసర చర్యలు అవసరం, ”అని బిడెన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కరోనా వైరస్ సంక్షోభం అనేది చాలా సమస్యలను సృష్టిస్తుంది అని ట్రంప్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కరోనా విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్న బిడెన్ బాధ్యతలను చేపట్టిన వెంటనే 12 మంది సభ్యుల కోవిడ్ -19 టాస్క్‌ ఫోర్స్‌ ను ప్రకటించారు. ఆయన జనవరిలో బాధ్యతలను చేపట్టిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.