ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలు ఇవే..!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఉధృతి పెరిగిపోయింది. భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 3 ల‌క్ష‌లు దాటింది. దీంతో భార‌త్ నుంచి త‌మ త‌మ దేశాల‌కు ప్ర‌యాణికులు రాకుండా ప‌లు దేశాలు ఆంక్ష‌ల‌ను విధిస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే ఇండియా నుంచి విమానాల‌ను పూర్తిగా బ్యాన్ చేశాయి.

countries which put travel ban on india

యూఏఈ, ఆస్ట్రేలియా, ఒమ‌న్ దేశాలు ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధించాయి. భార‌త్ నుంచి విమానాలు ఈ దేశాల‌కు వెళ్ల‌డంపై నిషేధం విధించారు. భార‌త్ నుంచి వ‌చ్చే విమానాల‌పై కెన‌డా 30 రోజుల నిషేధం విధించింది.

ఇక భార‌త్‌ను యూకే రెడ్ లిస్ట్‌లో పెట్టింది. ఈ క్ర‌మంలో ఇండియా నుంచి వ‌చ్చే విమానాల‌పై యూకే నిషేధం విధించింది. గ‌తంలో న్యూజిలాండ్ కూడా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఇజ్రాయెల్ దేశం త‌మ దేశ‌స్థుల‌ను ఇండియా, ఉక్రెయిన్‌, ఇథియోపియా, బ్రెజిల్‌, సౌతాఫ్రికా, మెక్సికో, ట‌ర్కీల‌కు వెళ్ల‌కూడ‌ని హెచ్చ‌రిక‌లు చేసింది. అమెరికా కూడా త‌న పౌరుల‌కు ఇలాంటి హెచ్చ‌రిక‌లే చేసింది.

ఇక మ‌న పొరుగు దేశ‌మైన పాకిస్థాన్ కూడా ఇండియా నుంచి ప్ర‌యాణికులు రాకుండా 2 వారాల పాటు ట్రావెల్ బ్యాన్ విధించింది. హాంగ్‌కాంగ్ మ‌న దేశం నుంచి వ‌చ్చే విమానాల‌పై మే 3వ తేదీ వ‌ర‌కు నిషేధం విధించ‌గా సింగ‌పూర్ లో ప్ర‌యాణికుల‌ను 14 రోజుల వ‌ర‌కు క్వారంటైన్‌లో ఉండాల‌ని ఆదేశాలు జారీ చేశారు.