టర్కీ, సిరియా భూకంపాలు.. 11,000 దాటిన మృతుల సంఖ్య

-

టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ విపత్తులో ఇప్పటి వరకు 11 వేల మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

భూకంపం సంభవించి 2 రోజులు దాటినా శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 11,000 మందికిపైగా బలయ్యారు. వేలసంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత భూకంపం.. ఈ దశాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు వెల్లడించారు.

20,000 మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ఇప్పటికే అంచనా వేసింది. ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఈ విపత్తు ధాటికి వేలాదిమంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని యునిసెఫ్ అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news