ఇరాన్‌కు చెందిన ఓ పాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానం గగనతలంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ బెదిరింపు రావడంతో ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు. కానీ వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
అప్రమత్తమైన అధికారులు వెంటనే భారత వాయుసేనను రంగంలోకి దించారు. వాయుసేన ఫైటర్ జెట్లు.. ఆ పాసింజర్ విమానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం ఆ విమానం చైనా దిశగా సాగుతోంది. ఇరాన్‌కు చెందిన ఆ విమానం గమ్యస్థానం చైనా అని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రతా సంస్థలు ఆ విమానం కదలికల్ని నిశితంగా గమనిస్తున్నాయని వెల్లడించారు.