త్వరలోనే చైనాకు భారతీయ విద్యార్థులు!

-

చైనాలో చదువుకుంటూ కొవిడ్‌ కారణంగా స్వస్థలాలకే పరిమితమైన వేలాది మంది భారతీయ విద్యార్థులకు డ్రాగన్‌ ఆశావహమైన కబురు చెప్పింది. భారత్‌తో పాటు, వివిధ దేశాలకు చెందిన విద్యార్థులను తిరిగి రప్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈమేరకు సమీప భవిష్యత్తులోనే తొలి బ్యాచ్‌ భారతీయ విద్యార్థులు చేరుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

ఈ విషయమై చర్యలు ముమ్మరం చేసినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ విలేకరులకు తెలిపారు. విద్యార్థులను దశలవారీగా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చైనాలో చదువుకుంటున్న 23 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు కొవిడ్‌ వీసా నిబంధనల కారణంగా స్వస్థలాల్లో ఉండిపోయారు. వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే.

ఈ నేపథ్యంలో చదువుల కోసం తక్షణం తిరిగి రావాలని ఆశిస్తున్న విద్యార్థుల పేర్లను చైనా అడగడంతో.. వందల మందితో జాబితాను భారత్‌ పంపించింది. వీరికి సంబంధించి తిరిగిరప్పించే ప్రక్రియ ఏ దశలో ఉందని విలేకరులు అడగ్గా.. ‘‘ఓపిగ్గా వ్యవహరించండి. దీనిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం’’ అని వెన్‌బిన్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news