ఉగ్రవాదాన్ని సహించబోం.. తాలిబన్లకు అమెరికా ప్రెసిడెంట్ హెచ్చరిక..

-

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైన సంగతి తెలిసిందే. అష్రాఫ్ ఘని దేశం విడిచి పారిపోవడం, అమెరికా శిక్షణ ఇచ్చిన సైన్యాలు చేతులెత్తేయడంతో ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఇతర దేశాల వారి పరిస్థితులపై అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఐతే అమెరికా పౌరుల సంరక్షణ గురించి ప్రెసిడెంట్ బైడెన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆఫ్ఘన్ లోని అమెరికా పౌరుల భద్రతే మా లక్ష్యమని, అందుకోసం మేం సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా పౌరుల తరలింపు మొదలైందని, ఇప్పటి వరకు 18వేల మందిని తరలించామని అన్నారు.

కాబూల్ ఎయిర్ పోర్ట్ పూర్తిగా యుఎస్ బలగాల పహారాలో ఉందని, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని వ్యాఖ్యానించారు. తాలిబన్ల దాష్టీకం తర్వాత అక్కడ అమెరికన్ల పౌరుల భద్రత గురించి అనేక అనుమానాలున్న తరుణంలో ప్రెసిడెంట్ బైడెన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news