పరారీలో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌..!

-

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవిస్తూ అనారోగ్య కారణాలతో కోర్టు అనుమతిపై లండన్ వెళ్లడం తెలిసిందే. అయితే తన బెయిల్ సమయం ముగిసినా ఆయన ఇంకా యూకేలోనే ఉండడం పట్ల పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో పాక్ ప్రభుత్వం నవాజ్ పరారీలో ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాదు నవాజ్ షరీఫ్‌ను వెంటనే అప్పగించాలని బ్రిటన్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం కోరింది. లాహోర్‌లో శనివారం ఇమ్రాన్ ఖాన్ సలహాదారు షాజాద్ అక్బర్ మీడియాతో మాట్లాడుతూ..

నవాజ్ షరీఫ్ అనేక సందర్భాల్లో లండన్ లో బహిరంగంగా దర్శనమిచ్చారు. ఆయనలో అనారోగ్య ఛాయలేవీ లేకపోగా, ఎంతో ఉల్లాసంగా కనిపించారు. ఇది నిజంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి కోర్టు ఎదుట చెంపదెబ్బ అని అన్నారు. ఈ చర్య వ్యక్తిగత నిర్ణయం కాదని అన్నారు. ఒకవేళ నవాజ్ షరీఫ్ గనుక పాకిస్తాన్ రాకపోతే.. ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్ పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news