నిరసనలతో అట్టుడికిన ఫ్రాన్స్.. రిటైర్మెంట్ వయసు తగ్గించాలని రోడ్డెక్కిన 10 లక్షల మంది

-

పదిలక్షల మంది ప్రజల నిరసనలతో ఫ్రాన్స్ అట్టుడికిపోయింది. దేశ రాజధాని పారిస్​లో 1,19,000 మంది కవాతు నిర్వహించారు. నిరసనకారులు రోడ్లను దిగ్బంధించడం వల్ల హింస చెలరేగింది. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 64 ఏళ్లకు పెంచాలని ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్​ మేక్రాన్ ప్రకటించిన బిల్​కు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా కార్మికులు నిరసన చేపట్టారు.

రైల్వే స్టేషన్లు, చార్లెస్ డి గల్లే ఎయిర్ పోర్టు, రిఫైనరీలు, ఓడరేవులను నిరసనకారులు దిగ్బంధించారు. పది లక్షల మంది పారిస్ లో కవాతు చేశారు. ఇప్పటి వరకు పారిస్ లో చేసిన కవాతుల్లో ఇదే అతి పెద్దదని ఆ దేశ అంతర్గత వ్యవహారల మంత్రిత్వ శాఖ పేర్కొంది. పశ్చిమ ఫ్రాన్స్ నగరాలైన నాంటెస్, రెన్నెస్, లోరియంట్ లో కూడా నిరసనకారులు కవాతు నిర్వహించారు.

పారిస్ లో నిరసనకారులు పలు అధికారక భవనాలపై దాడికి తెగబడ్డారు. అక్కడి పోలీస్ స్టేషన్ ను తగులబెట్టారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిపై టియర్ గ్యాస్ ను ఉపయోగించి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి స్పృహ తప్పిపడిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news