అమెరికా డ్రోన్ దాడిలో ఆరుగురు పిల్లలు బలి.. ఆఫ్ఘన్ నివేదిక

ఆఫ్ఘనిస్తాన్ పై డ్రోన్ దాడి చేసిన అమెరికా, కాబూల్ ఆత్మహుతి దాడి పథకాన్ని రూపొందించిన ఉగ్రవాదిని మట్టుపెట్టింది. వాహనంలో వెళ్తున్న వ్యూహకర్తను గుర్తించిన అమెరికా డ్రోన్, అక్కడికక్కడే పేల్చివేసింది. ఈ విషయాన్ని అమెరికా సగర్వంగా ప్రకటించింది. ఐతే తాజా సమాచారం ప్రకారం అమెరికా డ్రోన్ పేలుళ్ళలో ఆరుగురు పిల్లలు బలైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు సీఎన్ఎన్ లో వచ్చిన కథనం ప్రకారం, పేలుళ్ళు జరిగిన ప్రాంతంలో ఒక కుటుంబం కూడా గాయపడింది.

అందులో ఆరుగురు పిల్లలు ఉన్నారు. అలా చనిపోయిన వారిలో రెండు సంవత్సరాల పాప కూడా ఉందని సీఎన్ఎన్ ప్రచురించింది. పేలుళ్ళు జరిగిన ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఈ విషయాలను వెల్లడించినట్లు సమాచారం. ఆ పేలుళ్ళని నేను దగ్గర నుండి చూసాను. వాళ్ళంతా ముక్కలు ముక్కలు అయ్యారు. దాదాపు అయిదాగురు పడిపోయి ఉన్నారు. అందులో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. అని ఆహద్ వివరించినట్లు ఆఫ్ఘన్ నివేదించింది.