హుజురాబాద్ అభ్యర్థి ప్రకటనలో కాంగ్రెస్ ముందడుగు..

తెలంగాణ రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక అందుకు కారణమైంది. ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి రాజకీయం కుతకుత ఉడికిపోతుంది. హుజురాబాద్ ను దక్కించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీల నుండి హుజురాబాద్ లో బరిలో ఎవరు నిలుస్తున్నారనే విషయం ఖాయం అయిపోయింది. తాజాగా కాంగ్రెస్ అందుకు ముందడుగు వేయనుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుంది.

టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎన్నికయినప్పటి నుండి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. అదే ఉత్సాహాన్ని హుజురాబాద్ ఉపఎన్నికల్లో చూపించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ మేరకు అభ్యర్తి ఎవరనే విషయంలో నిర్ణయం తీసుకోనుంది. అందుకే ఈ రోజు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎవరిని నిలబెడితే బాగుంటుందనే అంశాలను చూసుకుని, ఎవరి పేరు ప్రకటించాలనే నిర్ణయం తీసుకుంటారు. మరి కాంగ్రెస్ హుజురాబాద్ అభ్యర్థి అవకాశం ఎవరికి ఇస్తుందో చూడాలి.