పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్… అధికారికంగా ఎన్నుకున్న ప్రతిపక్షాలు

-

పాక్ ప్రధాని ఎవరనేదానిపై సస్పెన్స్ వీడింది. ముస్లీంలీగ్- నవాజ్ పార్టీ తరుపున పాకిస్తాన్ ప్రధానిగా షెహబాాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతారని అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈయనే పాక్ కాబోయే ప్రధాని అని తేలింది. విపక్షాలు తమ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ ను ఎన్నుకున్నాయి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడే షహబాజ్ షరీఫ్. గతంలో పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా షహబాజ్ పని చేశారు. 

ప్రతిపక్షాలలో ముఖ్యంగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరుపున మాజీ ప్రధాని జెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో షహబాజ్ షరీఫ్ కు మద్దతు పలికారు. అయితే షహజాబ్ షరీఫ్ ప్రధాని అయ్యాక అతని మంత్రి వర్గంలో బిలావల్ భుట్టోకు విదేశాంగ మంత్రిగా అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. రేపు సోమవారం షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ పాక్ ప్రధాని పీఠాన్ని అధిరోహించిన వారు ఎవ్వరూ కూడా తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొని పదవిని కోల్పోయిన మొదటి వ్యక్తి ఇమ్రాన్ ఖానే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news