జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా.. రికార్డు స్థాయిలో పడిపోయిన వివాహాలు

-

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా భారీగా పెరిగిపోతుంటే.. కొన్ని దేశాలు మాత్రం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మరో పదేళ్లలో పలు దేశాల్లో యువత సంఖ్య భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాభా తగ్గుముఖంతో ఇప్పటికే చైనా, జపాన్‌లు సతమతమవుతుండగా.. తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది.

దక్షిణ కొరియాకు జనాభా సంక్షోభం ఇది పెను సవాలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ వివాహాల సంఖ్య గతేడాది రికార్డు స్థాయిలో పడిపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే ప్రపంచంలోనే అతితక్కువ జననాల రేటున్న ద.కొరియాకు.. పౌరులు ఆలస్య వివాహాలు చేసుకోవడం/దూరంగా ఉండటం వంటివి మరింత కలవరపెడుతున్నాయి.

కొన్ని దశాబ్దాలుగా దక్షిణ కొరియా జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. ప్రస్తుతం 5.2కోట్ల జనాభా ఉండగా.. 2067 నాటికి అది 3.9కోట్లకు పడిపోనున్నట్లు అంచనా. దశాబ్ద కాలంతో వివాహాల సంఖ్య 40శాతం తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా 1970 తర్వాత ఇంత కనిష్ఠ స్థాయిలో వివాహాలు జరగడం కూడా ఇది తొలిసారి.

Read more RELATED
Recommended to you

Latest news