కరోనాపై గెలిచిన ప్రధానిని, ప్రజలు మళ్ళీ గెలిపించారు…!

కరోనా వైరస్ విషయంలో సమర్ధవంతంగా పని చేసిన న్యూజిలాండ్ ప్రధాని జసిందాను మళ్ళీ ప్రధాని పీఠంపై కూర్చోపెట్టారు ప్రజలు. శనివారం జరిగిన న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ ప్రాతినిధ్యం వహిస్తున్న సెంటర్-లెఫ్ట్ లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. 40 ఏళ్ళ జసిందా విజయంపై పలు దేశాలు కూడా ప్రసంశలు కురిపిస్తున్నాయి.New Zealand PM encourages supporters to vote in election

అంతే కాదు… ఆమె సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. మొదటిసారి ప్రధాని అయినప్పుడు ఒక జాతీయవాద పార్టీతో అధికారాన్ని పంచుకున్నారు. “ఇది చారిత్రాత్మక మార్పు” అని వెల్లింగ్టన్లోని విక్టోరియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజకీయ వ్యాఖ్యాత బ్రైస్ ఎడ్వర్డ్స్ అన్నారు. 80 ఏళ్ళ న్యూజిలాండ్ చరిత్రలో ఇదే తొలిసారి.