తన వైద్యం కోసం తానే విరాళాలు సేకరిస్తున్న చిన్నారి.. చదివితే కన్నీళ్లు వస్తాయి..!

Join Our Community
follow manalokam on social media

తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు.. పేదరికంలో ఉన్నవారికి అయితే ఎవరో ఒకరు సహాయం చేయాల్సి వస్తుంది.. లేదా విరాళాలు సేకరించాల్సి ఉంటుంది. అలా అయితేనే వారి ప్రాణాలు దక్కుతాయి. అయితే ఆ బాలిక ఓ వైపు ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా.. తన చికిత్స కోసం తానే విరాళాలను సేకరిస్తోంది. ఈ సంఘటన అందరినీ కలచి వేస్తోంది.

this girls collecting donations for her own operation

అమెరికాలోని అలబామాలో లిజా అనే చిన్నారికి గత జనవరి నెల 30వ తేదీ వరకు అంతా బాగానే ఉంది. ఆమె ఆరోగ్యంగానే ఉంది. కానీ సడెన్ గా ఒక రోజు ఉదయాన్నే 5 గంటల సమయంలో ఆమెకు ఫిట్స్‌ వచ్చాయి. సుమారుగా 45 నిమిషాల పాటు ఆమె ఫిట్స్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. అయితే ఆమెను ఎలాగో హాస్పిటల్‌లో చేర్పించి తల్లి ఎలిజబెత్‌ స్కాట్‌ చికిత్సను అందించింది. ఈ క్రమంలో వైద్యులు లిజాకు పరీక్షలు చేసి చూడగా.. ఆమెకు మెదడులో మూడు చోట్ల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు.

అయితే లిజాకు చికిత్సను అందించేందుకు ఆమె తల్లి ఎలిజబెత్‌ స్కాట్‌ వద్ద అంత మొత్తం లేదు. దీంతో ఆమె తన కుమార్తె వైద్యం కోసం విరాళాలను సేకరించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. అయితే ఆ చిన్నారి కూడా ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతూనే మరోవైపు బర్మింగ్‌హామ్ లో ఉన్న తన తల్లికి చెందిన సావేజ్ అనే బేకరీ పక్కన చిన్న స్టాండ్‌ పెట్టి లెమనేడ్‌ అమ్మసాగింది. ఈ క్రమంలో ఆ చిన్నారి గురించి తెలుసుకున్న వారు ఆమె దగ్గర లెమనేడ్‌ను కొనడంతోపాటు ఆమె శస్త్ర చికిత్సకు తమకు తోచినంత విరాళాలను కూడా అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ చిన్నారి తన లెమనేడ్‌ స్టాండ్‌ ద్వారా ఇప్పటి వరకు 12వేల డాలర్ల విరాళాలను సేకరించింది. అయితే ఆమె ఆరోగ్యం బాగాలేనందున ప్రస్తుతం బోస్టన్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటోంది.

ఇక లిజా తల్లి ఎలిజబెత్‌ మొదలు పెట్టిన ఫండ్‌ రైజర్‌ కార్యక్రమానికి కూడా చాలా మంది స్పందించారు. పెద్ద ఎత్తున విరాళాలను పంపారు. ఈ క్రమంలో 3 లక్షల డాలర్ల విరాళాలు వచ్చాయి. దీంతో లిజాకు త్వరలో మెదడుకు శస్త్ర చికిత్స చేయనున్నారు. ఆ చిన్నారి విషయం మాత్రం అక్కడ చాలా మందిని కలతకు గురి చేస్తోంది.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...