‘కాళీమాత’ ఫొటోతో వివాదాస్పద ట్వీట్‌.. సారీ చెప్పిన ఉక్రెయిన్‌

-

కాళీమాత ఫొటోతో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉక్రెయిన్​ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్​పై యావత్ భారతదేశం తీవ్రంగా ఫైర్ అయింది. దీంతో దిగొచ్చిన ఉక్రెయిన్​ ఇవాళ క్షమాపణలు చెప్పింది.

‘కాళీమాత’ ఫొటోతో అభ్యంతరకర ట్వీట్‌ చేసినందుకు గానూ ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు. ‘కాళీ దేవతను వక్రీకరిస్తూ చిత్రీకరించినందుకు ఉక్రెయిన్ పశ్చాత్తాపపడుతోంది. ఉక్రెయిన్ భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంది. భారత్‌ సాయాన్ని మేము అభినందిస్తున్నాము’ అని ఎమిన్ పేర్కొన్నారు.

రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత వెలువడిన పొగపై కాళీ మాతను తలిపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తు తెచ్చేలా ఉక్రెయిన్ ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో స్త్రీ బొమ్మను ట్వీట్ చేసింది. కాళీ మాతను పోలినట్లు ఉన్న ఈ ఫొటోను చిత్రీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, భారతీయులు ఉక్రెయిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ‘హిందూ ఫోబియా’ అంటూ పలువురు భారతీయులు ఉక్రెయిన్‌ను నిందించారు.

Read more RELATED
Recommended to you

Latest news