అంతర్జాతీయ వేదికపై గొడవ.. రష్యా ప్రతినిధిపై ఉక్రెయిన్‌ ఎంపీ దాడి.. వీడియో వైరల్

-

రష్యా, ఉక్రెయిన్​ల మధ్య యుద్ధం ఏడాదికిపైగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ వేదికలపై ఈ ఇరు దేశాల నేతలు కలుసుకున్నప్పుడు ఎడముఖం పెడ ముఖంగానే ఉంటున్నాయి. తాజాగా మాత్రం తమ స్థాయి, స్థానం మరిచి రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై గొడవకు దిగారు. రష్యా ప్రతినిధి కవ్వింపు చర్యలతో ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్‌ ఎంపీ ఆయనపై దాడికి దిగారు. ఈ ఘర్షణ టర్కీ రాజధాని అంకారాలో చోటుచేసుకుంది.

అంకారాలో ‘బ్లాక్‌ సీ ఎకనామిక్‌ కమ్యూనిటీ’ 61వ సమావేశం జరుగుతోంది. ఈ వేదికగా ఉక్రెయిన్‌ ఎంపీ ఒకరు తన దేశ జెండాను ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే సమయంలో రష్యా ప్రతినిధి ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆ జెండాను లాక్కొని దూరంగా వెళ్లబోయారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ.. ఆ రష్యా వ్యక్తిపై వేగంగా దూసుకెళ్లి, దాడి చేశారు. ఆ తర్వాత తన జెండాను వెనక్కి తీసుకున్నారు. ఈ ఆకస్మిక చర్యతో అక్కడున్నవారు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఆ తర్వాత ఇద్దరిని విడదీశారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version