ప్రపంచ ధనవంతుల్లో మూడవ స్థానం ఎలాన్ మస్క్.. ఫేస్ బుక్ ని కిందకి లాగి..

ప్రపంచ ధనవంతుల జాబితాలో మార్పులు వచ్చాయి. స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మూడవ స్థానంలోకి వచ్చేసాడు. అప్పటి వరకూ ఆ స్థానాన్ని ఆక్రమించుకున్న ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ని కిందకి లాగి మూడవ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇటీవల అంజర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి నలుగు అస్ట్రోనాట్స్ కి పంపడం ద్వారా టెస్లా షేర్ వాల్స్యూస్ విపరీతంగా పెరిగాయి. దాంతో ఒక్కసారిగా ధనవంతుల జాబితాలో మార్పులు వచ్చాయి.

మొదటి స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఉండ, రెండవ స్థానంలో బిల్ గేట్స్, మూడవ స్థానంలో ఎలాన్ మస్క్, నాలుగు- మార్క్ జుకర్ బర్గ్ ఉన్నారు. సంపద విషయానికి వస్తే జెఫ్ బెజోస్ 184బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 129బిలియన్ డాలర్లు, ఎలాన్ మస్క్ 110బిలియన్ డాలర్లు, జుకర్ బర్గ్ 104బిలియన్ డాలర్లు గా ఉన్నారు. ఐతే ఈ నలుగురూ కూడా అమెరికాకి చెందిన వారే కావడం విశేషం.