ట్విట్ట‌ర్ సేవ‌ల్లో అంత‌రాయం.. ఎందుకంటే..?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ముఖ సోష‌ల్ మీడియాలో భాగ‌మైన‌టువంటి ట్విట్ట‌ర్‌లో కొంత స‌మ‌యం వ‌ర‌కు అంత‌రాయం నెల‌కొన్న‌ది. ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్ట‌ర్ ప్ర‌కారం..ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురు యూజ‌ర్లు శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల త‌రువాత ట్విట్ట‌ర్ ఖాతాల్లో స‌మ‌స్య‌లు ఎదుర్కున్న‌ట్టు తెలిపారు. ముఖ్యంగా భార‌త్‌లో దాదాపు గంట పాటు ట్విట్ట‌ర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోలేక‌పోయిన‌ట్టు ప‌లువురు యూజ‌ర్లు ఫిర్యాదు చేశారు.

మొబైల్‌తో పాటు వెబ్ సైట్‌లో కూడా ట్విట్ట‌ర్‌ను వినియోగించుకోలేక‌పోయామ‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా లోడింగ్ స‌మ‌స్య‌తో పోస్టింగ్‌లు చేయ‌లేక‌పోయామ‌ని, లాగిన్ కాలేక‌పోయామ‌ని కొంద‌రూ పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వినియోగిస్తున్న త‌రుణంలోనే ఆటోమెటిక్‌గా లాగౌట్ అయింద‌ని మ‌రికొంద‌రూ ఫిర్యాదు చేశారు. దీనిపై ట్విట్ట‌ర్ య‌జ‌మాన్యం స్పందించింది. సాంకేతికంగా స‌మ‌స్య త‌లెత్త‌డంతోనే స‌మ‌స్య వ‌చ్చింద‌ని.. వెంట‌నే స‌రిచేసిన‌ట్టు వెల్ల‌డించింది. ట్విట్ట‌ర్ అంత‌రాయానికి క్ష‌మించాల‌ని యూజ‌ర్ల‌కు యాజ‌మాన్యం విజ్ఞ‌ప్తి చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news