‘నా ఇష్టంతోనే వెళ్లిపోయాను.. నాకోసం వెతకొద్దు’.. విశాఖ బీచ్​లో అదృశ్యమైన సాయిప్రియ

-

విశాఖ ఆర్కే బీచ్​లో పెళ్లి రోజే గల్లంతైన యువతి సాయిప్రియ కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆమె కోసం కోటి రూపాయలు ఖర్చు చేసి నౌకాదళ హెలికాప్టర్లతో అధికారులు అవిశ్రాంతంగా గాలిస్తే.. అనూహ్యంగా ఆమె నెల్లూరులో ప్రత్యక్షమైంది.

‘నాన్నా… నేను బతికే ఉన్నాను. నేను మరో పెళ్లి చేసుకున్నా. మేము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. ఒకర్ని వదిలి మరొకరం ఉండలేం. అతనే(రవి)మీ బలవంతం చేసి తీసుకురాలేదు. దయచేసి మా కోసం వెతకొద్దు ఇక పరిగెత్తే ఓపిక నాకు లేదు. ఇక చావైనా, బతుకైనా అతనితోనే. నాకు బతకాలని ఉంది. నా గురించి వెతికితే ఇద్దరం కలిసే చచ్చిపోతాం.నా కోసం వెతికిన అధికారులను క్షమించమని వేడుకుంటున్నా’’ అని బెంగళూరు నుంచి తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ చేసింది. రవితో తాను ఇష్టపూర్వకంగానే వెళ్లానని.. తాళిబొట్టుతో ఉన్న ఫొటోను తల్లిదండ్రులకు పంపింది.

విశాఖ బీచ్‌లో వివాహిత గల్లంతైందన్న అనుమానం.. ఆమె కోసం పోలీసులు, కోస్ట్ గార్డు సిబ్బంది గాలింపు వృథా ప్రయాసగా మారింది. సాయిప్రియ ఆర్కే బీచ్​లో గల్లంతైందని భర్త, కుటుంబ సభ్యులు చెప్పడంతో నిన్నంతా కోస్ట్ గార్డు హెలికాప్టర్, రెండు పెద్ద బోట్లు తీరాన్ని జల్లెడ పట్టాయి. బీచ్‌లో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు మహిళ గల్లంతైన ఆనవాళ్లు ఎక్కడా కానరాకపోవడంతో మరో కోణంలో విచారణ సాగించారు. ఆమె కాల్ డేటాను పరిశీలించడంతో ఆమె నెల్లూరులో ఉందన్న వ్యవహారం బయటకు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news