దిల్ రాజుకు క్షమాపణలు చెప్పిన జగపతిబాబు..ఎందుకో మీకు తెలుసా?

-

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు..ప్రజెంట్ క్రేజీ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. తన 50 వ సినిమా ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. దిల్ రాజుకు ఇటీవల ప్రముఖ నటుడు, స్టైలిష్ విలన్ జగపతిబాబు ఓ విషయంలో క్షమాపణలు చెప్పారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.

డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను సినీ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసిన దిల్ రాజు..ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. కానీ, అప్పట్లో సాధారణ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే. అప్పుడు స్టార్ హీరో జగపతిబాబు ఒక సినిమా చేశారు. ఇప్పుడు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ లోనూ జగపతి బాబు ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా, అప్పట్లో జగపతి బాబు నటించిన ‘పెళ్లి పందిరి’ పిక్చర్ విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమాను తీసుకుని తాను ప్రమోషన్స్ చేస్తానని దిల్ రాజు జగపతిబాబుకు చెప్పారట.

దిల్ రాజును చూసి జగపతిబాబు అప్పుడు సాధ్యమేనా.. అని అడిగారట. డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి సినిమా కొని నెక్స్ట్ లెవల్ ప్రమోషన్స్ దిల్ రాజుకు సాధ్యమా? అని అనుమానించాడట జగపతిబాబు. కానీ, ఆ తర్వాత తనదైన శైలిలో దిల్ రాజు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఫ్యామిలీ సినిమా కావడంతో మూవీ యూనిట్ సభ్యులు, హీరో జగపతిబాబును హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు తీసుకెళ్లి అందరితో మాట్లాడించారు. అలా ఆ సినిమా విజయం సాధించేందుకు వినూత్న ప్రయత్నాలు దిల్ రాజు చేశారు. అలా ఆ మూవీ బాగా హిట్ అయింది. ఆ విషయం గుర్తు చేసుకుని ఇటీవల జగపతి బాబు దిల్ రాజుకు సారీ చెప్పాడట. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news