నిన్న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో లీగ్ షెడ్యూల్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుందని బీసీసీఐ నిన్న ప్రకటించింది. మే 29వ తేదీన అహ్మదాబాదులో జరగనున్న ఫైనల్ మ్యాచ్ తొలి ముగియనుంది. అయితే.. బీసీసీఐ మరో కీలక ప్రకటన చేసింది.
ఐపీఎల్ జట్లను ఎప్పుడు లేని విధంగా రెండు గ్రూపులు గా విభజించింది బీసీసీఐ. దీంతో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. రెండు కొత్త జట్లు, లక్నో సూపర్ జెయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ వేర్వేరు గ్రూపులలో చోటు దక్కించుకున్నాయి. ఏ గ్రూపులో ఏ జట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రూప్ A:
ముంబై ఇండియన్స్ (MI)
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)
రాజస్థాన్ రాయల్స్ (RR)
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
గ్రూప్ B:
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
పంజాబ్ కింగ్స్ (PBKS)
గుజరాత్ టైటాన్స్ (GT)