అహమ్మదాబాద్ వేదికగా హోమ్ టీం గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ ల మధ్యన క్వాలిఫైయర్ 2 జరగడానికి సర్వం సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చెన్నైతో ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. కానీ ఎవరు గెలుస్తారు అన్నది మాత్రమే ఊహించడం చాలా కష్టం, ఎందుకంటే రెండు జట్లు సమతూకముతో ఉన్నాయి. కాగా ఈ రెండు జట్లలో ఒక్క ఆటగాడు మాత్రం తన భయంకరమైన ఫామ్ తో ప్రత్యర్థులను వణికించాడు. ఈ ఐపీఎల్ లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసి మంచి ఊపుమీదున్నాడు.
ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో శుబ్ మాన్ గిల్ 15 మ్యాచ్ లలో 722 పరుగులతో రెండవ స్థానంలో ఉండగా, బెంగుళూరు కెప్టెన్ డుప్లిసిస్ 730 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్ లోనూ గిల్ సెంచరీ సాధించి తన జట్టును ఫైనల్ కు చేరుస్తాడా అని అభిమానులు అంతా ఎదురుచూస్తున్నారు.