ఐపిఎల్ 2023: ప్లే ఆఫ్ రేస్ నుండి నిష్క్రమించిన ఢిల్లీ క్యాపిటల్స్ … !

-

ఐపిఎల్ సీజన్ 16 లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించని మొదటి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిష్క్రమించింది. గత మ్యాచ్ లో ఓటమితోనే ప్లే ఆఫ్ అవకాశాలను పోగొట్టుకున్న ఢిల్లీ ఎక్కడో చిన్న ఆశతో ఉన్నది…కానీ ఈ రోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా 31 పరుగుల తేడాతో ఓడిపోవడంతో 12 మ్యాచ్ లలో 4 మాత్రమే గెలిచి 8 పాయింట్ లతో చివరి స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో ఇక మిగిలిన రెండు మ్యాచ్ లు కేవలం నామమాత్రమే. గెలిచినా ఓడినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. పంజాబ్ విసిరిన 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మొదటి వికెట్ కు పవర్ ప్లే లో వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది ఢిల్లీ జట్టు.

ఇక మరో 84 బంతుల్లో 103 పరుగులు చేస్తే ఢిల్లీ విజయం సాధిస్తుంది. కానీ అప్పుడే పంజాబ్ స్పిన్నర్ల మాయ ప్రారంభం అయింది. చాహార్ మరియు బ్రార్ లు కలిసి 8 ఓవర్ లలో 6 వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించారు. ముఖ్యంగా బ్రార్ 4 వికెట్లతో రాణించి పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలను నిలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news