ఐపీఎల్ 2023: బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉన్న పిచ్ పై ఇంత తక్కువ స్కోరా ?

-

ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ పూర్తి అయింది. మొదట బ్యాటింగ్ చేసిన వార్నర్ ఏ ఉద్దేశ్యంతో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడో ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న. మనమేమైనా ఇంతకు ముందు మ్యాచ్ లలో మొదటి బ్యాటింగ్ చేసి 200 పరుగులు మేర చేసి ఉంటే, బ్యాటింగ్ తీసుకున్నాడు సరిగ్గా సరిపోయేది. కానీ బ్యాటింగ్ కు స్వర్గధామం లాంటి ఉప్పల్ పిచ్ పైన మరీ దారుణమైన స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్ లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులకే పరిమితం అయింది.

ఈ స్కోర్ ను చూసిన క్రికెట్ ప్రముఖులు మరియు విశ్లేషకులు ఈ వికెట్ పైన ఇంత తక్కువ స్కోర్ చేయడం బహుశా ఇదే మొదటిసారేమో అంటూ కామెంట్ చేస్తున్నారు. అస్సలు క్రీజులో నిలబడాలంటేనే భయపడుతున్నారు ఢిల్లీ ఆటగాళ్లు. దీనిపైనా కెప్టెన్ వార్నర్ మరియు కోచ్ రికీ పాంటింగ్ లు సరైన ఎనాలిసిస్ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news