ప్రస్తుతం దేశ ప్రధాని మోదీ కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొచ్చిన్ లో జరిగిన యువన్ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశ అభివృద్ధి మరియు ఇందులో యువత పాత్ర గురించి చెప్పారు. ఒకప్పుడు ఈ దేశాన్ని నేను ఏమి చేయగలను మరియు నేను ఈ దేశంలో ఏమి మార్చగలను అంటూ ఆలోచించేవాడనని.. కానీ నేడు ఆ భయం అవసరం లేకుండా మన దేశంలో ఉన్న యువత కీలక పాత్రను పోషిస్తుందన్నారు. ఇప్పుడు నా భారతదేశం ఒక పెద్ద ఆర్ధిక వ్యవస్థగా మారిందన్నారు. ఇప్పుడు మారిన ఈ దేశం ప్రపంచాన్ని సైతం మార్చగలదు అంటూ గర్వంగా చెప్పారు.