ఐపీఎల్ లో సీజన్ మొత్తం బంతితో అద్భుతంగా రాణించి అత్యధిక వికెట్లను సాధించిన ప్లేయర్ కు పర్పుల్ క్యాప్ మరియు ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ కు ఆరంజ్ క్యాప్ ను బీసీసీఐ అందిస్తుంది. అందుకే సీనియర్ జూనియర్ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ క్యాప్ లను దక్కించుకోవడానికి శ్రమిస్తుంటారు. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 16 లో ఆరంజ్ క్యాప్ ను దక్కించుకునే లిస్ట్ లో బెంగుళూరు కెప్టెన్ డుప్లిసిస్ 466 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ రోజు మ్యాచ్ ముందు వరకు అత్యధిక వికెట్లను అందుకున్న బౌలర్ల జాబితాలో చెన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే 17 వికెట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచాడు.
ఈ రోజు ఢిల్లీ జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి మంచి స్పెల్ తో 4 ఓవర్ లలో కేవలం 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లను అందుకున్నాడు. దీనితో వికెట్లను అందుకుని పాండే కన్నా మంచి ఎకానమీ రన్ రేట్ తో షమీ మొదటి స్థానంలో నిలిచి పర్పుల్ క్యాప్ ను అందుకున్నాడు.