ఎంతో కీలకం అయిన ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ ల మధ్యన ఇప్పుడు అహమ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉండగా… ఫ్యాన్స్ కి ఎంతో నిరాశను కలిగించే వార్త అని చెప్పాలి. క్రికెట్ ను ఎంతగానో ఇష్టపడే అభిమానులు అంతా ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ గెలవాలని ఆశపడుతుంటారు. కాగా ఈ మ్యాచ్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక గంట నుండి అహమ్మదాబాద్ లో ఎడతెరిపి లేకుండాఆ వర్ష పడడంతో మైదానం అంతా తడిగా మారిపోయింది. అయితే శుభవార్త లాగా ప్రస్తుతం వర్షం మాత్రం పడుకున్నా.. టాస్ ఇంకా పడలేదు. కానీ మ్యాచ్ మధ్యలో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఒకవేళ వర్షం వలన మ్యాచ్ ఆడడం కుదరకపోతే లీగ్ స్టేజ్ లో ముంబై కన్నా మెరుగైన స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.