రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఐపీఎల్ లో ఇన్ని సీజన్ లు అయినప్పటికీ, ఇంతవరకు టైటిల్ ను సాధించలేకపోయింది. కనీసం ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో అయినా ఆ కోరికను తీర్చుకుంటుంది అనుకున్న బెంగుళూరు అభిమానులకు మళ్ళీ నిరాశే ఎదురైంది. గత రాత్రి జరిగిన మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కు వెళుతుంది. కానీ విరాట్ కోహ్లీ ఒక్క ఆటగాడు తప్ప అందరూ ఫెయిల్ అయిన వేళ గుజరాత్ టైటాన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. దీనితో బెంగుళూరు ప్లే ఆఫ్ కు చేరుకోకుండానే మరోసారి టోర్నీ నుండి నిష్క్రమించింది. అయితే ఈ విషయంపై అభిమానులలో భారీగా చర్చ జరుగుతోంది. ప్రతి సీజన్ లో పేపర్ మీద జట్టు ఎంత అద్భుతంగా ఉన్నా ఆటలో సరిగా ఆడక ఫెయిల్ అవుతోంది. ఇక ఈసారి కూడా అదే విధంగా అంచనాలు భారీగా ఉన్నా ప్లే ఆఫ్ చేరడంలో ఫెయిల్ అయింది.
కాగా ఈ టోర్నీలో ఇలా విఫలం కావడం ప్రధాన కారణం.. మిడిల్ ఆర్డర్, హిట్టర్స్, స్పిన్ బౌలింగ్ మరియు ఆల్ రౌండర్ లు పూర్తిగా తేలిపోవడమే. విరాట్, మాక్స్ వెల్ మరియు డుప్లిసిస్ మినహా ఎవ్వరూ బ్యాటింగ్ లో రాణించింది లేదు. బౌలింగ్ లో ఎప్పుడూ సిరాజ్ తప్ప రాణించిన బౌలర్ లేడు, ఇక స్పిన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది.