ఈ రోజు హైద్రాబాద్ వేదికగా SRH మరియు RCB ల మధ్యన చాలా కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచ్ లో బెంగుళూరు ను ఢీ కొడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత రాత్రి మ్యాచ్ లో ఢిల్లీ పంజాబ్ కు భారీ షాక్ ఇచ్చింది, ప్లే ఆఫ్ నుండి వెళ్లిపోయిన ఢిల్లీ ఛాన్స్ ఉన్న పంజాబ్ ను ఓడించడం ద్వారా చావు దెబ్బ తగిలినట్లయింది. కాగా ఈ రోజు బెంగుళూరు గెలిస్తే ప్లే ఆఫ్ కు వెళ్ళడానికి అవకాశాలు సజీవంగా ఉంటాయి. అందుకే ఈ రోజు మ్యాచ్ లో గెలవాలని విరాట్ కోహ్లీ అభిమానులు మద్దతు ఇస్తున్నారు. కాగా ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే… SRH ఫ్యాన్స్ కూడా బెంగుళూరు గెలవాలని కోరుకుంటున్నారు. ఎలాగూ హైదరాబాద్ ప్లే ఆఫ్ రేస్ లో లేకపోవడంతో కోహ్లీ టీం గెలవాలని ప్రార్ధనలు చేస్తున్నారట.
IPL 2023: కోహ్లీ టీం గెలవాలని హైదరాబాద్ ఫ్యాన్స్ ప్రార్ధనలు..
-