CSK Vs DC : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌

-

ఐపీఎల్‌లో (IPL 2025) మ్యాచుల్లో భాగంగా ఇవాళ చెన్నైతో డీసీ ఆడుతోంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్నాడు.

ధోనీ ఈ మ్యాచ్‌కు కెప్టెన్సీ చేస్తార‌ని ఊహాగానాలు వినిపించినా.. టాస్ కోసం గైక్వాడ్ మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ పుకార్లకు చెక్ పడింది. ఒక‌వేళ టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునేవాళ్ల‌మ‌ని గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. గ‌త మ్యాచ్‌లో తమ ప‌ర్ఫార్మెన్స్ బాగున్నా… ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో చేయ‌లేక‌పోయిన‌ట్లు తెలిపాడు.  ఓవ‌ర్‌ట‌న్ స్థానంలో కాన్వే, త్రిపాఠి స్థానంలో ముఖేశ్ టీమ్ లోకి వ‌చ్చారు. ఇక డీసీ జ‌ట్టులోకి స‌మీర్ రిజ్వి ఎంట్రీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news