ఐపీఎల్: రెండవ సూపర్ ఓవర్లో బుమ్రా బౌలింగ్ ఎందుకు చేయలేదంటే..?

-

ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచులు ప్రేక్షకులకి మంచి మజాని పంచాయి. జరిగిన రెండు మ్యాచులు కూడా టై కావడం ఒక ఎత్తైతే, అందులో ఒక మ్యాచ్ సెకండ్ సూపర్ ఓవర్ కి వెళ్ళడం మరో ఎత్తు. ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచు టై కాగానే జరిగిన మొదటి సూపర్ ఓవర్లో పంజాబ్ తరపు నుండి బుమ్రా బౌలింగ్ వేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సూపర్ ఓవర్ కూడా టై కావడంతో మళ్లీ మరో సూప ఓవర్ కి తెరలేపారు.

సెకండ్ సూపర్ ఓవర్ కి మాత్రం బుమ్రా బౌలింగ్ వేయలేదు. మరి దీనికి కారణమేంటని చాలా మందికి అనుమానంగా ఉంది. ఐతే సాధారణంగా సెకండ్ సూపర్ ఓవర్ వరకూ రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందుకే దానికి సంబంధించిన చాలా విషయాలు ఎక్కువ మందికి తెలియదు. ఐతే మొదటి సారి సూపర్ ఓవర్ వేసిన వారు రెండవ సారి సూపర్ వేయడానికి వీలు లేదట. ఒక సూపర్ ఓవర్లో బౌలింగ్ వేసిన తర్వాత మ్యాచ్ టై ఐతే మరో సూపర్ ఓవర్ వేయకూడదు. అలాగే బ్యాట్స్ మెన్ విషయంలో, ఒక సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కి దిగితే, మళ్ళీ మరో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కి దిగకూడదు.

మొత్తానికి ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త మ్యాచుగా నిలిచిన ముంబై ఇండియన్స్, పంజాబ్ మ్యాచులో పంజాబ్ గెలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news