ఏపీలో ఎలా అయినా వచ్చే ఎన్నికల్లో గెలవాలని, తెలంగాణాలో కనీసం ఉనికి చాటుకోవాలనే లక్ష్యంతో సంస్థాగత ప్రక్షాళనకు నడుం బిగించిన టీడీపీ అందులో భాగంగా ఈరోజు కొత్తగా రాష్ట్రాల కమిటీలను ప్రకటించింది. .టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు, తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్ రమణను ప్రకటించారు..24మంది సభ్యులతో కొత్త పొలిట్ బ్యూరోను ప్రకటించారు..27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేశారు. .ఈ కమిటీలో ఆరుగురిని వైస్ ప్రెసిడెంట్లుగా నియామించారు.
సెంట్రల్ జనరల్ కమిటీ సభ్యులుగా మరో 8మందిని ప్రకటించారు. ఇక తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసి నియమింపబడగా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నారా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డి, నర్సింహులు, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రతిభా భారతి, కాశీనాథ్, గల్లా అరుణ, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావులను నియమించారు.
ఇక పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల, అశోక్ గజపతి రాజు, అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చిన రాజప్ప, సోమిరెడ్డి, కాలవ శ్రీనివాసులు, బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బొండా ఉమా, ఫారూక్, గల్లా జయదేవ్, రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్‌కుమార్‌గౌడ్‌ను నియమించారు. ఇక పొలిట్ బ్యూరోలో నారా లోకేష్, అచ్చెన్న, ఎల్.రమణలు కూడా సభ్యులుగా చోటు దక్కించుకున్నారు.