భారీ వర్షాలపై ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణలో భారీ వర్షాలపై ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.భారీ వర్షాలతో కడెం, కాళేశ్వరం కింద కొంత డ్యామేజ్ జరిగిందని అన్నారు.కొంత మంది బెస్ లెస్ గా మాట్లాడుతూన్నారని అన్నారు.18 సంస్థలు చూసి ఒకే చెప్పిన తరువాత ప్రాజెక్ట్ లు కడుతారని అన్నారు.Imd డేటా, యూరో సాటిలైట్ తో వాతావరణ పరిస్థితులను గమనిస్తున్నాం అని తెలిపారు.కడెం, కాళేశ్వరం కింద జరిగిన పరిస్థితుల పై కమిటీ విచారణ చేస్తోందన్నారు.

100 ఏండ్ల తరువాత భారీ వర్షాలు మళ్లీ పడ్డాయన్నారు.పంపు హౌజ్ లకు అయ్యే ఖర్చులు 400 కోట్లు అవుతుందని చెప్పారు కానీ.. పంప్ హౌజ్ ను ప్రాజెక్ట్ కట్టిన సంస్థనే రిపేర్ చేస్తుందన్నారు. పంప్ హౌజ్ రిపేర్ చేయడానికి 20, 25 కోట్లకు మించి కావన్నారు. సెప్టెంబర్ లోపు పంప్ హౌజ్లు నడుస్తాయనీ తెలిపారు.

నాలుగు మండలాలలో ఎక్కువగా వర్షపాతం నమోదైందన్నారు.వాతావరణ మార్పులలో బాగంగా భారీ వర్షం కురిసిందన్నారు.క్లౌడ్ బరస్ట్ అనేది టెక్నికల్ పదం కాదని,ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులలో మార్పు జరిగిందన్నారు.పంప్ హౌజ్ దగ్గర పవర్ రిస్టోర్ అయ్యిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news