గుండెపోటు అందుకే వస్తుందా?..డాక్టర్లు చెప్పిన విస్తుపోయే నిజాలు..

-

ఇటీవల కాలంలో గుండెపోటు సంఖ్య పెరిగిన విషయం అందరికి తెలిసిందే.. అతి చిన్నావయస్సులోనే గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది..దీనికి కారణం ఏంటనే విషయం తెలియదు కానీ సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు వినిపిస్తున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై ప్రముఖ డాక్టర్ కిరణ్ స్పందించారు. గుండెపోటు కేసులు పెరగడం బాధాకరమని.. అయితే ఏ కారణాల వల్ల ఇవి జరుగుతున్నాయనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

 

ఈమధ్య తక్కువ వ్యవధిలో బరువు పెరిగినా లేదా తగ్గినా దగ్గర్లోని వైద్యులను సంప్రదించాలని డాక్టర్ కిరణ్​ సూచించారు. హైపో థైరాయిడిజం లాంటివి ఉన్నా వైద్యులను సంప్రదించాలన్నారు. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు వస్తోందనేది అసంబద్ధమని చెప్పారు. టీకాలు తీసుకోవడం వల్లే అందరూ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారని తెలిపారు. జరుగుతున్న అన్ని అనర్థాలకు వ్యాక్సిన్​లతో ముడిపెట్టొద్దన్నారు. వ్యాక్సిన్​లతో భయపడొద్దన్నారు..

అంతేకాదు ఫోన్ల వాడకం ఎక్కువ అవ్వడం వల్లే గుండె పోటు జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు.. సరైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించారు. అధికమైన ఒత్తిడి వల్ల గుండెపై తీవ్ర భారం కలుగుతుందని.. కాబట్టి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. గుండెకు భారమయ్యే ఆలోచనలను దూరంగా ఉంచాలన్నారు. మంచి ఆలోచనలు, అలవాట్లను జీవన శైలిలో భాగం చేసుకోవాలన్నారు. ఫోన్ల వాడకం, సోషల్ మీడియా వినియోగం వల్ల వచ్చే అనవసరమైన ఎగ్జయిట్​మెంట్ కూడా గుండెకు భారమేనన్నారు.. చూసారుగా అవసరం ఉన్నా లేకున్నా ఫోన్లను వాడితే మీ ప్రాణాలకే ముప్పు గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news