సాధారణంగా.. మన ఇంటి దగ్గర్లో టెంపుల్ ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది..పాజిటివ్ వైబ్ అనుకుంటారు. కానీ దేవాలయాల సమీపంలో , ముందు వెనుక, చుట్టుపక్కల ఇళ్ళు ఉండకూడదని పెద్దోళ్లు అంటారు. అసలు ఆలయానికి ఎటువైపు ఇళ్లు ఉండాలి. ఎటువైపు ఉండొద్దు..? ఇలాంటి కొన్ని వాస్తు నిబంధనలు చూద్దామా..!
ఆలయం నుంచి వచ్చే శక్తి తరంగాలు ఇళ్లపై పడితే ఆ శక్తిని తట్టుకునే వాతావరణం ఆ ఇంటికి ఉండకపోవచ్చు. అందుకే ఆలయాలకు సమీపంలో ఇళ్లు ఉండకూడదని పండితులు చెబుతారు. దీన్నే మరో రకంగా చెప్పాలంటే గుడి నీడ ఇంటిపై పడకూడదు అని ఇందుకే అంటారు. అయితే ఆలయాల సమీపంలో నివాస స్థలాలు ఉండకూడదని కాదు.
ఆలయాల దగ్గర్లో ఇళ్లు ఉంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి..
ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు, మనశ్సాంతి ఉండదంటారు వాస్తు నిపుణులు. ఆ ఇంట్లో నిత్యం ఏదో విషయంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఆలయానికి మరీ దగ్గరగా కాకుండా కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలి. ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలి.
శివాలయాలకు వెనుక వైపు, విష్ణు ఆలయాలకు ముందు వైపు ఇల్లు ఉండొచ్చు.
శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదని పండితులు చెబుతారు.
అమ్మవారి ఆలయానికి దగ్గర్లో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరు, ఏ కార్యక్రమంలోనూ పురోగతి సాధించరట.
ఏ ఆలయానికి అయినా కనీసం 100 అడుగుల దూరం తప్పనిసరి.
ఇంటి పై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదంటారు. దేవుడి ధ్వజం శక్తి సంపన్నం, ఉగ్రరూపం అందుకే ధ్వజస్తంభం ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో పర్వతాలు, నదీతీరంలో మాత్రమే దేవాలయాలు ఉండేవి.
పర్వతంపై దేవాలయాన్ని నిర్మించడం ఉత్తమం. నదుల సమీపంలో ఉంటే మధ్యమం. గ్రామం, నగరాల మధ్యలో ఆలయం నిర్మిస్తే అధమం అని మహర్షులు శ్లోకం రూపంలో చెప్పారు.
విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఇంటికి ఉత్తరం, వాయువ్యం వైపు ఉంటే వారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.