కర్పూరం వాసన పీల్చుకోవడం మంచిదేనా..?

-

పూజగదిలో వెళ్లగానే మనకు మంచి వాసన వస్తుంది.. అగర్బత్తి, కర్పూరం వాసనకు మనసకు ప్రశాంతంగా అనిపిస్తుంది. సాధారణంగా దేవుడి పూజలో కర్పూరాన్ని ఉపయోగిస్తారు. అలాగే కర్పూరాన్ని కాల్చినప్పుడు మంచి వాసన వస్తుంది. అయితే కర్పూరాన్ని పూజలో వాడటమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని మీకు తెలుసా..?
అవును, అయితే కర్పూరం నుండి వచ్చే సువాసన అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. కర్పూరం సువాసనను రోజూ పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఎందుకంటే దాని నుంచి వచ్చే వాసన మీ మనసును ప్రశాంతపరుస్తుంది. ఇలా చేస్తే మీకు తెలియకుండానే మీ ముఖంలో చిరునవ్వు వస్తుంది.
అంతే కాకుండా కర్పూరం సువాసన పీల్చడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మీకు తలనొప్పి, మైగ్రేన్‌ల నుండి తక్షణ ఉపశమనం కావాలంటే, కర్పూరం యొక్క సువాసనను పీల్చుకోండి. అదేవిధంగా కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. అవి సూక్ష్మక్రిములను దూరంగా ఉంచుతాయి. కాబట్టి, ఇంటిని శుభ్రపరిచేటప్పుడు కర్పూరం పొడిని ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మరియు ఇల్లు చెడు వాసన లేదు.
అలాగే కర్పూరాన్ని పొడి చేసి నూనెలో కలిపి శరీరానికి రాసుకుంటే నొప్పులు, దురదలు తగ్గుతాయి. అంతే కాకుండా కండరాలు మరియు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. అయితే, మీకు అలెర్జీ సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండండి.
కర్పూరం తయారవుతుందిలా..
సినమోమం చంపోరా అనే చెట్టు నుంచి ఈ కర్పూరం వస్తుంది. దీన్నే మనం కర్పూరం చెట్టు అంటుంటాం. దీని వేర్లు, చెక్క, బెరడు, విత్తనాలు, ఆకులను ప్రాసెస్ చేసి కర్పూరం, పచ్చ కర్పూరం, కర్పూర నూనె తదితరాలను తీస్తారు. అయితే ఇప్పుడు సహజమైన కర్పూరం కంటే మార్కెట్లో సింథటిక్‌ కర్పూరం పెరిగిపోయింది. దీన్ని ఆరోగ్య అవసరాల కోసం వాడకుండా ఉండటమే ఉత్తమం. సహజమైన కర్పూరం దొరికితే మాత్రం కచ్చితంగా వాడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version