కేంద్రంపై జగన్ పోరాడే సమయం వచ్చేసింది…?

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సరే ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలావరకు ఇబ్బంది పడుతోంది. రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా చూసినా వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. దీనిపై తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. గతంలో ఉన్న పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఇప్పుడు లేవు. చాలా వరకు కూడా గత ఏడాది కాలంగా కంపెనీలు మూతపడిన పరిస్థితి. విదేశీ కంపెనీలు అసలు వచ్చే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో లేదు అనే విషయం అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు కంపెనీలను ఆహ్వానించి ఆలోచనలో లేకుండా కేవలం ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ప్రయత్నాలు సీఎం జగన్ చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ విషయంలో విమర్శలు వస్తున్న సరే సీఎం జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కుతగ్గే పరిస్థితి లేదు.

Jagan
Jagan

త్వరలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రం గట్టిగా పోరాటం చేయకపోతే కేంద్రం నుంచి రూపాయి కూడా వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. రాష్ట్రానికి ఇప్పుడు ఆర్థిక సహకారం అనేది కేంద్రం నుంచి చాలా అవసరం. ప్రధానంగా జిఎస్టి నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే పోరాడాల్సిన అవసరం అనేది ఉంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటాలను కూడా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు ఆర్థిక వ్యవస్థ తో పాటు ఆరోగ్య వ్యవస్థ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతోంది. కరోనా దెబ్బకు రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వైద్య వ్యవస్థ పరిస్థితి రోజు రోజుకి దిగజారి పోతోంది.

కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇప్పుడు కేంద్రంపై గట్టిగానే పోరాటం చేయాల్సిన అవసరం అనేది ఉంది. అయితే సీఎం జగన్ మాత్రం ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో అనేదా ని పైనే అంతా ఆసక్తిగా చూస్తున్నారు. వాస్తవానికి సీఎం జగన్ కేంద్రంతో సున్నం పోసుకునే ఆలోచనలో మాత్రం లేరు అనే విషయం చెప్పవచ్చు. కాబట్టి కేంద్రాన్ని సఖ్యత తోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తోంది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుతూనే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఆదాయ మార్గాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు కేంద్రం ఈ కరోనా సమయంలో ఆదుకోవాల్సిన అవసరం అనేది ఉంది.

రాష్ట్రానికి ఇప్పుడు కనీసం 15 వేల కోట్లు అయినా కేంద్రం నుంచి సహాయం రాకపోతే వచ్చేనెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆటోమొబైల్ రంగం తో పాటుగా రియల్ఎస్టేట్ రంగం చాలా వరకు కూడా నాశనం అయిపోయింది. రియల్ఎస్టేట్ రంగం దాదాపు ఏడాది కాలంగా నిర్వీర్యం అయిపోయింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. దానితో రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా భారీగా పడిపోయింది. ఇటు అమరావతి వ్యవహారం కూడా రాష్ట్ర ఆదాయంపై కాస్త ఎక్కువగానే ప్రభావం చూపించింది. అటు విశాఖకు కూడా ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రావడం లేదు. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి చాలావరకు పోరాడే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విషయంలో సీఎం జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది చూడాలి.