సరికొత్త వివాదంలో కాజోల్.. అవసరమా..?

-

తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అజయ్ దేవగన్ భార్య కాజోల్ రాజకీయ నాయకులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వాస్తవానికి ఆమె చేసిన కామెంట్లలో నిజం ఉన్నప్పటికీ కూడా కొన్ని వర్గాల వారికి మాత్రం అది మింగుడు పడడం లేదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె కామెంట్లు యావత్ భారతీయ రాజకీయ నాయకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ కొంతమంది కాజోల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో స్పందించిన కాజోల్ తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వక తప్పలేదు.

ఇకపోతే కాజోల్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి అనే విషయానికి వస్తే.. ఏదైనా దేశం అభివృద్ధి చెందాలి అంటే బాగా చదువుకున్న నాయకులు రాజకీయ రంగంలో ఉండడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా భారతదేశం వంటి దేశంలో పురోగతి చాలా నెమ్మదిగా ఉంది.కాబట్టి చదువుకున్న రాజకీయ నాయకులు కావాలి.. ఎందుకంటే మన సాంప్రదాయాలకు మనం కట్టుబడి ఉన్నాము.. మన ఆలోచన విధానాలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా అక్షరాస్యత లేని రాజకీయ నాయకులు మన దేశంలో చాలామంది ఉన్నారు..

చదువు లేని రాజకీయ నాయకులు ప్రజలను పరిపాలిస్తున్నారు. వారిలో చాలామందికి కనీసం నిర్దిష్ట ఆలోచన కూడా ఉండదు. అదే చదువుకున్న నేతలైతే విభిన్న దృక్కోణంలో ఆలోచించి పనిచేస్తారు. ప్రజలకు మేలు చేస్తారు అంటూ కాజోల్ కామెంట్లు చేయగా వీటిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇకపోతే ఈ వివాదంపై స్పందించిన కాజోల్.. నేను విద్య, దాని ప్రాముఖ్యత గురించి మాత్రమే మాట్లాడాను. రాజకీయ నాయకులను కించపరచడం నా ఉద్దేశం కాదు.. దేశాల్ని సరైన మార్గంలో నడిపించే గొప్ప నాయకులు మనకు ఉన్నారు అంటూ ఆమె వెల్లడించింది. ఇక కాజోల్ చేసిన కామెంట్లలో నిజం ఉన్నప్పటికీ కొంతమంది అనవసరంగా గెలుక్కోవడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news