మ్యూచువల్ ఫండ్స్: తక్కువ వాల్యూ ఉన్న ఫండ్లలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలుంటాయా?

-

మ్యూచువల్ ఫండ్స్ ( Mutual Funds )లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదొక పెద్ద సమస్య. తక్కువ “ఎన్ ఏ వీ” (నెట్ అసెట్ వాల్యూ) ఉన్న ఫండ్లలో ఎక్కువ లాభం ఉంటుందా? ఎక్కువ వాల్యూ ఉన్న ఫండ్లలో ఎక్కువ లాభం ఉంటుందా అన్న సందేహంలో పెట్టుబడి ఆలస్యం చేస్తుంటారు. ఆ ఆలోచనతో ఎటూ అర్థం అవక కొన్ని సార్లు అసలు పెట్టుబడి పెట్టడమే మర్చిపోతారు. ప్రస్తుతం ఈ రెండింట్లో తేడా ఏముంది? దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం ఉంటుంది? అన్న విషయాలను చర్చిద్దాం.

మ్యూచువల్ ఫండ్స్ | Mutual Funds
మ్యూచువల్ ఫండ్స్ | Mutual Funds

కొత్తగా ప్రారంభమయ్యే ఫండ్ల నెట్ అసెట్ వాల్యూ 10రూపాయలు ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక 10వేల రూపాయలు పెట్టుబడి పెట్టావనుకుందాం. అప్పుడు నీకు 10రూపాయలు విలువగల 1000యూనిట్లు వస్తాయి.

అదే 200రూపాయల నెట్ అసెట్ వాల్యూగల ఫండ్ లో అదే 10వేల రూపాయలు పెట్టుబడి పెట్టావు. అపుడు నీకు 50యూనిట్లు వస్తాయి.

ఈ రెండు పెట్టుబడుల్లో సంవత్సరం తర్వాత 10శాతం పెరిగింది అనుకుందాం. అప్పుడు 10రూపాయలు నెట్ అసెట్ వాల్యూ ఉన్న ఫండ్ వాల్యూ 11రూపాయలు అవుతుంది. దాంతో మీరు పెట్టిన 10వేల రూపాయల పెట్టుబడి 11వేల రూపాయలు అవుతుంది.

అలాగే 200రూపాయల వాల్యూ ఉన్న ఫండ్ కి 10శాతం పెరిగితే 20రూపాయలు పెరుగుతుంది. అప్పుడు దాని వాల్యూ 220రూపాయలు అవుతుంది. అంటే 220రూపాయలతో 50యూనిట్లని లెక్కకడితే 11వేల రూపాయలు వస్తాయి.

అంటే ఏ లెక్కన చూసినా మీకు వచ్చే లాభం 11వేలే. కాబట్టి “ఎన్ ఏ వీ” గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట.

గమనిక: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన అన్ని దస్తావేజులు జాగ్రత్తగా చదవండి.

 

Read More:

భార‌త రాజ్యాంగం క‌ల్పించిన ముఖ్య‌మైన హ‌క్కులు.. తెలుసుకోండి..!

గోవా దూధ్ సాగ‌ర్ : పాల లాంటి నీటి జ‌ల‌పాతం.. వాహ్ ఒక్క‌సారైనా చూడాల్సిందే..!

SBI: స్టేట్ బ్యాంక్ లో ఎక్కువ లాభం పొందాలంటే ఈ ఖాతా తెరవండి..!

IRCTC టూర్: రూ.500 ప్యాకేజీతో హైదరాబాద్ చూడచ్చు..!

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news