వానాకాలం అవ్వడం వల్ల చాలా చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని కొన్ని చోట్ల అయితే ఏకంగా వరదలే వచ్చేస్తున్నాయి. బెంగళూరు మొత్తం ఇప్పుడు భారీ వర్షాల కారణంగా నీటితో నిండిపోయింది. అయితే ఆ నీటిని ఇంట్లో నుంచి బయటకు పంపించడం చాలా కష్టమైన పని. అందుకోసం మీకు ఒక మ్యాజిక్ సొల్యూషన్. ఈ మ్యాజిక్ పౌడర్ ద్వారా సులభంగా వరద నీటిని ఇంట్లో నుంచి బయటకు పంపేయొచ్చు. ఒక పౌడర్ తో నిజంగా నీటిని మొత్తం తొలగించుకోవచ్చు అంటే నిజంగా అదృష్టమే కదా..
వరద నీటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఆ బాధ నుండి చిటికెలో ఇలా బయట పడిపోవచ్చు పైగా ఈ పౌడర్ వల్ల ఎలాంటి హాని కలగదు ఇది సురక్షితమే. ఈ కెమికల్ కాంపౌండ్ ని సోడియం పోలీ ఆక్రిలేట్ (sodium polyacrylate) అని అంటారు. దీని ధర సుమారు 70 రూపాయలు మాత్రమే. సోడియం పోలీ అసిరిలిక్ సులభంగా వరద నీటిని తొలగిస్తుంది.
సోడియం పోలీ ఆక్రిలేట్ ని వాటర్ లాక్ అని కూడా అంటారు. 100 నుండి 1000 రెట్లు నీటిని ఇది పీల్చుకోగలదు. దీనిని డైపర్లు, హెయిర్ గెల్స్, సబ్బులు వంటివాటిలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.
ఇది అసలు ఎలా పనిచేస్తుంది..?
రెండు స్పూన్ల కెమికల్ కాంపౌండ్ వేయండి. నీళ్లు కనుక దాన్ని తాకితే అది సాలిడ్ కింద మారిపోతుంది. అది కూడా ఐదు నిమిషాల్లోనే. ఒకవేళ కనుక మీరు నీళ్ల కింద మార్చాలంటే కొద్దిగా అయోడిన్ వేస్తే సరిపోతుంది.