100 ఎమ్మెల్యేలు ఉన్నోడు బిజెపికి ప్రత్యామ్నాయం ఐతడా?: రేవంత్ రెడ్డి

-

మునుగోడు లో నిన్న టిఆర్ఎస్ నిర్వహించిన ప్రజా దీవెన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడు బహిరంగ సభలో కాంగ్రెస్ కి ఓటు వేయొద్దంటూ కేసీఆర్ చెప్పాడని.. బిజెపికి ఓటెయ్యండి అని చెప్పకనే చెప్పాడని అన్నారు. బిజెపి, టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిన్ననే కేసీఆర్ చేశాడని ఎద్దేవా చేశారు. మూడో ప్లేసులో ఉండే బిజెపి గురించి అందుకే మాట్లాడాడని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు అనేది అబద్ధమని అన్నారు రేవంత్.

దేశవ్యాప్తంగా బిజెపికి 1443 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కాంగ్రెస్ కి 753 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. అలాంటప్పుడు వంద మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ బిజెపికి ప్రత్యామ్న్యాయం అవుతాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచిన ప్రభుత్వాలను బిజెపి గుంజుకుంటుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు 11 రాష్ట్రాలలో బిజెపి దురాక్రమమున చేసిందని మండిపడ్డారు. రావణాసురుడిది కూడా కొన్నాళ్లు సాగిందని.. ఆ తర్వాత ఏమైంది? అని అన్నారు. మోడీకి అనుకూలంగా ఉన్న సామంత రాజులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బిజెపి అడుగు పెట్టలేదని అన్నారు. మునుగోడు సమస్యలపై చర్చ జరగాలన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news