గత ఏడాది మార్చిలో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికీ తన మేనియా చూపించకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రపంచ స్థాయిలో పాపులారిటీ దక్కించుకోవడానికి కారణం ఈ సినిమా యూనిట్ చేసిన చిత్ర ప్రమోషన్స్ అని చెప్పవచ్చు.. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా.. దేశంతో పట్టింపులకు పోకుండా ఎక్కడపడితే అక్కడ పాపులారిటీ దక్కించుకోవడానికి రాజమౌళి పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆస్కార్ పొందడం కోసం ఆయన చేసిన శ్రమ ఎంతగా ఉంది అంటే తప్పకుండా అందులో నటించిన నటులకు ఆస్కార్ లభించే ఆస్కారం కూడా ఉంది అని చెప్పవచ్చు.
ఇకపోతే గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆస్కార్ నామినేషన్ కి సెలెక్ట్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే జనవరి 24వ తేదీన ప్రకటించబోయే ఆస్కార్స్ బెస్ట్ యాక్టర్ షార్ట్ ప్లేస్ లో ఎన్టీఆర్ పేరు ఖాయమని వెరైటీ మ్యాగజైన్ తో పాటు USA TODAY కూడా ఇదే విషయాన్ని రాసుకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే తారక్ ఆస్కార్ రేసులో నిలిచే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అయితే అకాడమీ సభ్యులను రామ్ చరణ్ కాకుండా ఎన్టీఆర్ మెప్పించడానికి గల కారణాలు కూడా ఉన్నాయి అని ఇప్పుడు బాగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
పులితో ఎంట్రీ సీన్ అలాగే ఇంటర్వెల్ లో జంతువులతో వచ్చే ఇంట్రో సీన్.. అలాగే సెకండ్ హాఫ్ లో కొమరం భీముడో పాటతో కూడా ఎన్టీఆర్ అకాడమీ సభ్యులను తన వైపు తిప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు సీన్స్ ఆస్కార్ లో చర్చకు తెర తీశాయని.. అంతేకాదు ఈ సీన్స్ లో తారక్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి వాళ్ళు ఫిదా అయ్యారు అని సమాచారం. అందుకే ఆస్కార్ అవార్డు ఆయనకు వచ్చే అవకాశం కూడా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.