ఇదేనా కెసిఆర్ మోడల్ తెలంగాణ? – రేవంత్ రెడ్డి

-

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగిని స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో కాళ్లు పట్టుకొని తల్లిదండ్రులు లాక్కెళ్ళిన ఘటన సంచలనంగా మారింది. బయట నుండి లిఫ్ట్ వరకు కాళ్లు పట్టుకొని లాక్కెళ్ళిన తీరు అందరినీ కలచివేసింది. కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని, ఆసుపత్రికి తీసుకు వెళితే స్ట్రెచర్ కనిపించలేదని తల్లిదండ్రులు తెలిపారు.

ఆసుపత్రి సిబ్బంది కూడా పట్టించుకోలేదని ఆ పేషెంట్ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ చెబుతున్న తెలంగాణ మోడల్ ఇదేనా..? అని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల లేమి అనేది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. బంధువులు ఈడ్చుకెల్లడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా..? అని నిలదీశారు. బిఆర్ఎస్ సర్కార్ అరాచక పాలన ఫలితమే ఈ ఘటన అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news