బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను నిరసిస్తూ.. ట్యాంక్ బండ్ వద్ద ఈరోజు వైయస్ షర్మిల మౌన దీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నా కేసీఆర్ సర్కారు పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గం అన్నారు షర్మిల.
మహిళల పక్షాన గొంతెత్తితే బలవంతంగా అరెస్ట్ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున ఒక మహిళకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలు అఘాయిత్యాలకు పాల్పడినా ఈ కెసిఆర్ మేలుకోడని అన్నారు. అత్యాచారాలు,లైంగిక వేధింపుల్లో దక్షిణ భారతంలోనే తెలంగాణను నం.1 స్థానంలో నిలిపిన దొరను, మహిళా లోకం ఎన్నడూ క్షమించదన్నారు షర్మిల.