మీ ఇల్లు వేడిగా ఉందా..? అయితే ఇలా చల్లగా మార్చేయండి మరి..!

-

వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు వాతావరణం అంతా కూడా వేడిగా ఉంటుంది. ఇల్లు కూడా వేడిగా ఉంటుంది దాంతో మనకి చిరాకు మొదలు రకరకాల సమస్యలు ఉంటాయి. ఇంటిని చల్లగా మార్చుకోవడం చాలా ముఖ్యం. రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటువంటి సమయంలో ఇంటిని చల్లగా మార్చుకోవడం చాలా అవసరం. ఇంటిని చల్లగా ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

దీనికోసం ముందు వేడి ప్రవేశించకుండా చూసుకోండి. ఇంటిని చల్లగా మార్చడానికి తలుపులు కిటికీలు దగ్గర కర్టెన్లని కట్టండి. అలానే సాధారణంగా బల్బులు గదిలో వేడిని పెంచేస్తాయి ఇంటిని చల్లగా మార్చడానికి లైట్లని ఆపండి ఇలా చేయడం వలన వేడి ఉండదు. కిటికీలని తలుపుల్ని క్లోజ్ చేసేయండి. ఇలా చేస్తే ఎయిర్ కూలర్ సులభంగా గదిని చల్లగా మార్చేస్తుంది. రాత్రిపూట కూడా మీరు కిటికీలని క్లోజ్ చేసేయండి.

రిఫ్రిజిరేటర్లు మైక్రో వేవ్స్ ని ఆపేయండి. ఐరన్ బాక్స్ లని కూడా ఉపయోగించొద్దు. రోజు బెడ్ షీట్లని మారుస్తూ ఉంటే కూడా వేడిని తగ్గించుకోవచ్చు. తెల్ల రంగు బెడ్ షీట్లని కాటన్ మెటీరియల్ తో చేసిన వాటిని ఉపయోగించండి. మీ ఫ్యాన్ కి సమీపంలో చల్లని వస్తువుల్ని ఉంచండి. ఐసు ముక్కల్ని ఉంచడం వలన గది సులభంగా చల్లగా మారిపోతుంది. ఇంటిని చల్లగా మార్చాలంటే ఇంటి లోపల, బయట మొక్కల్ని పెంచండి మొక్కలు కూడా మీ ఇంటిని చల్లగా మారుస్తాయి. గదిని ఉప్పునీటితో క్లీన్ చేస్తే కూడా చల్లగా ఇల్లు ఉంటుంది అలానే ఇంటి పై భాగాన్ని సాయంత్రం పూట తడుపుతూ ఉండండి ఇలా వేడిని మనం తగ్గించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news