చేపల కూర తిని నాలుగేళ్లు అయింది.. కడుపులో కాపురం పెట్టిన ముల్లు..సీన్‌ కట్‌ చేస్తే..

-

చికెన్‌, మటన్‌ కంటే చేపలకు ఉండే టేస్ట్‌ వేరు.. చేపల పులుసు విత్‌ ప్రైడ్ పీస్‌ వేసుకుని తింటుంటే ఉంటుంది.. అబ్బో నోరూరిపోతుంది కదా..! అయితే చాలామందికి చేపలు తినడం ఇష్టమున్నా.. ఆ ముల్లు తీసుకోలేక, భయం వేసి ధైర్యం చేయరు.. మెదక్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే చేపల కూరను ఓ పట్టుపట్టాడు.. ముళ్లా గిల్లా అని వెనకా ముందూ చూడకుండా లాగించేశాడు.. ఇంకేముందు ముల్లు కాస్తా పొట్టలోకి వెళ్లింది. ఇది జరిగి నాలుగేళ్లు అవుతుంది.. ఆరోజు నుంచి ఇప్పటి వరకూ అతను చేపముల్లు ఇరుక్కుపోయి తీవ్రంగా బాధపడ్డాడు.. ఫైనల్‌గా ఏం చేశారంటే..
మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది..గత నాలుగేళ్ల క్రితం చేప కూరతో భోజనం చేస్తూ ముక్కులోని ముల్లును మింగేశాడు సాయిలు అనే వ్యక్తి.. అప్పటి నుంచి గొంతులోంచి మెల్లిగా కడుపులోకి జారుకోవడంతో ముల్లు తీయడానికి సాధ్యపడలేదు. ఒంట్లో ఉండే వేడికి కరిగిపోతుందిలే అనుకున్నాడు. లోపలికి వెళ్లిన చేప ముల్లు గుచ్చుతుంటే కడుపు నొప్పితో నరకం చూశాడు.. ఎందుకురా చేపల కూరతిన్నాను అని రోజూ బాధపడేవాడట..

కడుపులో కాపురం..

చేప ముల్లు మింగిన సాయిలు నొప్పిని భరిస్తూ సుమారు నాలుగు సంవత్సరాలు గడిపాడు.. అయితే నొప్పి రోజు రోజుకు పెరగడంతో తట్టుకోలేకపోయాడు. నొప్పితో చాలా ఆసుపత్రులకు వెళ్లాడు.. అయినా పెద్ద ప్రయోజనం లేకపోలేదు. చివరగా గత 15 రోజులుగా భరించలేని కడుపు నొప్పి రావటంతో సాయిలు మెదక్‌లోని సాయిచంద్ర నర్సింగ్ హోం ఆస్పత్రిలో చూపించుకున్నాడు. ఆసుపత్రిలో డాక్టర్ కడుపు స్కాన్‌ చేసి చూడటంతో రెండు అంగుళాల పొడవుగల చేప ముల్లు కడుపులో ఉందని గుర్తించారు.
బాధితుడు సాయిలుకు ఆపరేషన్ చేసి ముల్లు తీయాల్సి ఉంటుందని చెప్పి శాస్త్రచికిత్స చేశారు.. ఎట్టకేలకు మంగళవారం డాక్టర్ సురేశ్ సాయిలు కడుపులో చేప ముల్లుని తీశాడు. చేప ముల్లు ఇంతలా ఇబ్బంది పెట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. చేప ముల్లు కోసం ఆపరేషన్ చేయడం తమ ప్రాక్టీస్‌లో ఇదే మొదటి సారిగా డాక్టర్ సురేష్‌ తెలిపారు. మొత్తానికి చిన్న ముల్లు పెద్ద కష్టమే తెచ్చింది. అందుకే చేపల కూరను చాలా జాగ్రత్తగా తినాలి..!

Read more RELATED
Recommended to you

Latest news