కరీంగనగర్ వాసులకు శుభవార్త.. త్వరలో ఐటీ హ‌బ్‌

-

వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌లో ఐటీ హ‌బ్‌లు విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్. త్రీ డీ మంత్రలో భాగంగా జిల్లా కేంద్రాల్లో ఐటీ హ‌బ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు కేటీఆర్. ప్రస్తుతం ప్రపంచమంతా త్రీ‘డీ’.. అంటే, డిజిటైజేషన్‌, డీకార్బనైజేషన్‌, డీసెంట్రలైజేషన్‌ విధానంలో దూసుకుపోతోందని, ఈ త్రీడీమంత్ర కొత్త అవకాశాలను, సృజనాత్మక విధానాలను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ ప‌లు సంద‌ర్భాల్లో పేర్కొంటున్న సంగ‌తి తెలిసిందే.

Telangana: In wake of floods, KTR to not celebrate birthday

నిజామాబాద్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, సిద్దిపేట‌, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ త్వ‌ర‌లోనే ఐటీ హ‌బ్‌లు ప్రారంభ‌మవుతాయ‌ని ప్ర‌క‌టించారు కేటీఆర్. ఆయా జిల్లాల్లో ఏర్పాట‌వుతున్న ఐటీ హ‌బ్‌ల ఫోటోల‌ను కేటీఆర్ షేర్ చేస్తూ, ప‌నుల పురోగ‌తిని వివ‌రించారు కేటీఆర్. నిజామాబాద్‌లో ఐటీ హ‌బ్ దాదాపు పూర్త‌యింది.. త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. ఐటీ హ‌బ్ కోసం కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్‌ను కేటీఆర్ అభినందించారు. ఇక స్థానికులకు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేందుకు పెట్టుబ‌డులు తీసుకురావ‌డంలో కృషి చేస్తున్న మ‌హేశ్ బిగాల‌ను కూడా అభినందించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news