కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయం పాటిస్తోంది : మల్లురవి

-

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ కొత్త కమిటీల్లో 50 మంది టీడీపీ నుండి వచ్చిన వాళ్లకు అవకాశం ఇచ్చారని సీనియర్ నేతల వ్యాఖ్యలను ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి ఖండించారు. టీడీపీ నుండి వచ్చిన నేతలకు ఇచ్చిన అవకాశంపై కమిటీల వారీగా లేఖ రూపంలో వివరించారు మల్లు రవి. పీఏసీలో ఉన్న 22 మందిలో టీడీపీ నుంచి వచ్చిన వారిలో రేవంత్ రెడ్డి తప్ప మరెవరూ లేరని మల్లు రవి చెప్పారు. పీఈసీలో ఉన్న 40 మంది సభ్యుల్లో టీడీపీకి చెందినవారు ఇద్దరు మాత్రమే ఉన్నారని తెలిపారు మల్లు రవి. వీపీలో ఉన్న 24 మందిలో ఐదుగురు మాత్రమే టీడీపీకి చెందిన వారన్నారు. జీఎస్ లో ఉన్న 84 మందిలో ఐదుగురు టీడీపీకి చెందిన వారిని మల్లురవి వివరించారు. ఇక డీసీసీకి చెందిన 26 మందిలో టీడీపీ నుంచి వచ్చిన వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. కొత్తగా విడుదల చేసిన జాబితాలో SC, ST, BCల్లో మైనారిటీలే 68శాతం ఉండగా.. OCలు 32శాతం ఉన్నారని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయం పాటిస్తోందని మల్లురవి పేర్కొన్నారు మల్లు రవి.

Hyderabad: Mallu Ravi hits out at TRS leaders

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులకు దక్కని కేసీఆర్ దర్శనం.. ఢిల్లీలో లభించిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం త్వరలోనే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఎలాంటి సమయం ఇవ్వని కేసీఆర్..చివరకు మంత్రులకు, సొంత పార్టీ నేతలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకులను చూడ్డానికి ఇష్టపడని కేసీఆర్ ఢిల్లీలో సర్వ దర్శనాలన్నీ ఒకేసారి అన్నట్లు మంత్రులతో పాటు అందరికీ ఒకేసారి సమయం ఇచ్చారని మల్లురవి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news