దురద సమస్యతో బాధపడే గర్భిణీలు ఇలా చేస్తే బెస్ట్..!

-

గర్భిణీలు తొమ్మిది నెలలలో ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయం లో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి పైగా ఇదంతా గర్భిణీలకు యుద్ధంలా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు ఎదుర్కునే సమస్యలలో దురద కూడా ఒకటి.

మహిళల ఛాతి మీద పొత్తి కడుపు మీద దురదలు సాధారణంగా వస్తాయి. దీనికి గల కారణం ఏమిటంటే ఎక్స్ట్రా బ్లడ్ పంపింగ్, హార్మోన్లలో మార్పులు. అయితే దురద సమస్య నుండి బయటపడాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం.

గర్భిణీలు దురద సమస్య నుండి బయట పడడానికి ఓట్ మీల్ తీసుకుని ఒక కప్పు నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే దురద సమస్య నుండి బయట పడవచ్చు.
కొబ్బరి నూనె కూడా దురద సమస్యలను పోగొడుతుంది. దురద కలిగిన చోట కొబ్బరి నూనెను ఉపయోగించి మసాజ్ చేస్తే దురద సమస్య పోతుంది.
కలబంద గుజ్జు కూడా దురద సమస్యని పోగొడుతుంది. దురద కలిగిన ప్రాంతంలో అలోవెరా జెల్ రాస్తే త్వరగా దురద పోతుంది. లేదంటే నిమ్మరసాన్ని కూడా దురద సమస్యలు పోగొట్టుకోవడానికి ఉపయోగించవచ్చు. దురద ఉన్నచోట నిమ్మరసాన్ని అప్లై చేస్తే వెంటనే రిలీఫ్ ని పొందొచ్చు.

గర్భిణీల కి పొత్తికడుపు ప్రాంతంలో అసలు ఎందుకు దురద వస్తుంది..?

బ్లడ్ సప్లై పెరగడం, డ్రై స్కిన్, ఒంటి మీద చిన్న చిన్న మచ్చలు రావడం, హార్మోన్స్లో మార్పులు వలన దురద వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news