స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్‌లో పెద్ద పంచాయితీనే నడుస్తోంది…ఇద్దరు సీనియర్ల మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది. అయితే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది..అలాగే నేతలంతా వీధికెక్కి మరి తిట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో కూడా కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది.
మొదట నుంచి ఇక్కడ ఇద్దరు నేతలకు పడేది కాదు. గతంలో రాజయ్య కాంగ్రెస్ లో, కడియం టీడీపీలో ఉండగా…వీరి మధ్య రాజకీయ వైరం వచ్చింది. కానీ తర్వాత ఇద్దరు నేతలు టీఆర్ఎస్‌లోకి వచ్చారు. అయితే 2014లో రాజయ్య స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా, కడియం వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక రాజయ్య మంత్రి కూడా అయ్యారు. కానీ పలు ఆరోపణల వల్ల రాజయ్యని మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీమ్ పదవి నుంచి కేసీఆర్ తప్పించారు.
ఇక కడియం చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి..ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. 2018 ఎన్నికల్లో మళ్ళీ రాజయ్య ఘనపూర్ నుంచి గెలిచారు. కడియంకు ఏ సీటు ఇవ్వలేదు. ఆ మధ్య ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే నియోజకవర్గంలో ఇరు వర్గాలకు పడని పరిస్తితి. ఇక ఈ మధ్య రాజయ్య…గతంలో కడియం టీడీపీ హయాంలో ఉండగా నక్సలైట్లని చంపించారని మాట్లాడారు. దీనికి కౌంటర్ గా కడియం కూడా ఫైర్ అయ్యారు. రాజయ్య అక్రమాలు, రాసలీలలు అంటూ మాట్లాడారు.
అలాగే సీటు నాది అంటే నాది అని ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇద్దరు నేతలు..తమకు కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. తాజాగా రాజయ్య..సీటు విషయంలో కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. అలాగే టీఆర్ఎస్ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా పాల్గొనాలని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వేటు తప్పదని పరోక్షంగా కడియం వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. తాజాగా స్టేషన్ నియోజకవర్గంలో మంత్రి తలసాని పర్యటన జరగగా, ఈ పర్యటనలో రాజయ్య ఉన్నారు గాని, కడియం పాల్గొనలేదు. మొత్తానికి ఇక్కడ పెద్ద పంచాయితీని ఉంది…మరి కేసీఆర్ ఎవరి వైపు ఉంటారు…ఎవరికి సీటు ఇస్తారనేది చూడాలి.